ములుగు జిల్లాలో 20 ఎకరాల్లో గ్రామస్థులు అడవులను నరికేశారు. ఏటూరునాగారం మండలం దొడ్ల గ్రామ శివారులో 20 ఎకరాల్లోని విలువైన చెట్లను గ్రామస్థులు నరికారు. పోడు భూములుగా మార్చి వ్యవసాయం చేసేందుకు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీంతో ఎన్నో ఏండ్ల నాటి వృక్ష సంపద నేలకొరిగింది.