టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోదరుడు వినోద్ సెహ్వాగ్ అరెస్ట్ అయ్యారు. రూ.7 కోట్ల చెక్‌బౌన్స్ కేసులో చంఢీగఢ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో స్థానిక కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. శ్రీ నైనా ప్లాస్టిక్స్ నుంచి రూ.7 కోట్ల విలువైన వస్తువులు కొనుగోలు చేసి చెక్కులు జారీ చేయగా.. ఆ చెక్కు బౌన్స్ అయింది.