AP: వైఎస్ వివేకానందా హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న మృతిపై సీఎం చంద్రబాబు తాజాగా స్పందించారు. ఆయన మరణం అనుమానాస్పదంగా ఉందని అన్నారు. రంగన్న మరణం వెనుక ఉన్న అనుమానాలను డిజిపి మంత్రులకు వివరించారు. కేబినెట్ సమావేశం తర్వాత ఈ విషయంపై చర్చ జరిగింది. పరిటాల రవి హత్య కేసులో సాక్షులు కూడా ఇలాగే చనిపోయారన్నారు. వైఎస్ జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాను పదే పదే చెబుతున్నానని సీఎం తెలిపారు.