దేవరకద్ర నియోజకవర్గం
కౌకుంట్లలో ఓ మోస్తరు వర్షం
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి వేడి గాలులతో అల్లాడిన జనం మద్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షానికి ప్రధాన రోడ్లు చిత్తడిగా మారాయి. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించి, గుంతల్లో నీరు నిలిచి ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. కాగా రైతులు వర్షం పడడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు.