జడ్చర్ల నియోజకవర్గం
బాలానగర్ మండల కేంద్రంలో భారీ వర్షం
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్న తరుణంలో శనివారం కురిసిన భారీ వర్షానికి పంటలకు మేలు చేకూరుతుందని రైతులన్నారు. వేరుశనగ పంట సాగుకు చేయడానికి ఈ వర్షం అనుకూలంగా మారిందన్నారు.