వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు ఆగదు: బండి సంజయ్

58చూసినవారు
వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు ఆగదు: బండి సంజయ్
వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు ఆగదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుకు అతి త్వరలోనే పార్లమెంట్‌ ఆమోదం తథ్యమని ఆయన శనివారం పేర్కొన్నారు. మజ్లిస్‌ దేశద్రోహ పార్టీ అని బండి ఆరోపించారు. మత కోణంలో అడ్డుకుంటే ప్రజలే తిరగబడతారన్నారు. దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడమని.. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించే పార్టీలకు గుణపాఠం తప్పదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్