భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మైసమ్మ గుడి వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న శంకర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన ఘటన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియోని స్థానిక పోలీసులు విడుదల చేశారు.