గోరి కొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన బట్టు మహేందర్ అను యువకుడు భూ తగాధ దాడిలో గాయపడ్డాడు. కాగా ఆయన ఎంజీఎంలో చికిత్స పొందుతుండగా మంగళవారం భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సూరం వీరేందర్ సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు వీరేందర్ సంఘటన విషయాలను మండల నాయకులు తోట కిట్టును అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.