అక్రమ రహదారులను తొలగించిన పోలీసులు

1521చూసినవారు
భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మానేరు సమీపంలో ఇసుక అక్రమ రవాణా కోసం వేసిన రహదారులను బుధవారం కాటారం సిఐ నాగార్జున రావు, కాటారం ఎస్సై అభినవ్ తొలగించారు. మానేరు పరివాహక ప్రాంతమైన విలాసాగర్, గంగారం ప్రాంతం నుండి మానేరు వాగుకు అక్రమంగా రహదారులు వేసి అక్రమ ఇసుక రవాణా చేపడుతున్నారని, పోలీసులు రహదారులను పరిశీలించి తొలగించారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాటారం పోలీసులు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్