కాళేశ్వరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

61చూసినవారు
భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శ్రీరామనవమి వేడుకలు బుధవారం అంగరంగా వైభవంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ రామాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల ప్రధాన ఉత్సవమూర్తులకు ఆలయ అర్చక బృందం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య కల్యాణ క్రతువు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్