భూపాలపల్లి: తమకు కేటాయించిన స్థలంలో భూమిని చదును చేసి ఇవ్వాలని ఆందోళన
తమకు కేటాయించిన స్థలంలో భూమిని చదును చేసి ఫ్లాట్లుగా మార్చి ఇవ్వాలంటూ, నగరంపల్లి గ్రామ భూ నిర్వాసిత రైతులు భూపాలపల్లి జిల్లా సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ త్రీ ప్రాజెక్టు ముందు గురువారం ఆందోళన చేపట్టారు. సింగరేణి ఓపెన్ కాస్టు ప్రాజెక్టు కింద తమ భూములు కోల్పోయామని, సింగరేణి సంస్థ తమకు 5 ఎకరాల భూమిని కేటాయించి పట్టాలు కూడా ఇచ్చారని, అందులో ఇండ్లు నిర్మించుకునే పరిస్థితి లేదన్నారు.