డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ, వెన్నారం, తోడేళ్ళగూడెం, ముల్కలపల్లి, రావిగూడెం, మల్లాయి కుంట తండా, బొడ్రాయి తండా తదితర గ్రామాలలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రుక్మాంగధర రావు, మండల అధ్యక్షులు జగదీష్, అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షులు స్వప్న, మాజీ సర్పంచ్ రాంప్రసాద్, మాజీ ఉపసర్పంచ్ శేషయ్య, యువత తదితరులు పాల్గొన్నారు.