జనగామ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా క్రీడాపోటీలు నిర్వహించారు. గురువారం ఈ సందర్భంగా ధర్మకంచ స్టేడియంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో డీసీపీ రాజ మహేంద్ర నాయక్ బౌలింగ్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బ్యాటింగ్ తో అదరగొట్టారు.