జనగామ జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ నిర్మూలనకై పాటుపడతామని యువతతో ప్రతిజ్ఞ చేయించారు.
పట్టణంలోని బతకమ్మ కుంటలో డ్రగ్స్ నిర్మూలన కై అవగాహన కార్యక్రమంలో భాగంగా 2కే రన్, సైకిల్ రైడ్ ను వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వారికి మెడల్స్ తో పాటు సర్టిఫికెట్ అందజేశారు.