జనగామ జిల్లా యశ్వంతపూర్ శివారులోని హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి పక్కన శుక్రవారం నూతన టీఎన్జీవో కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి కొండ సురేఖ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను మంత్రి కొండా సురేఖ అందజేశారు.