జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆకస్మిక తనిఖీ చేసి బయోమెట్రిక్ అటెండెన్స్ ను స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆరా తీశారు. అనంతరం హాస్పిటల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని హాస్పిటల్ కు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.