జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరికి చెందిన బక్క రాజు అనే వ్యక్తిపై ఈనెల 2వ తేదీన దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు ఎస్సై దూలం పవన్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన బక్క నర్సయ్య, బక్క నవీన్ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి భూమి తగాదా విషయంలో గొడవ పడి దాడి చేసి కొట్టగా ఫిర్యాదు మేరకు విచారణ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.