కొడకండ్లలో ఘనంగా రంజాన్ వేడుకలు

82చూసినవారు
కొడకండ్లలో ఘనంగా రంజాన్ వేడుకలు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలోని ఈద్గా లో ఈధ్ ఉల్ ఫితర్ నమాజ్ ను జమా మస్జీద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముస్లిం మత పెద్దలు మొహమ్మద్ బషీరుద్దీన్ పాల్గొని నమాజ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జామా మజీద్ కమిటీ అధ్యక్షులు గులామ్ గౌస్, సలావుద్దీన్, జావీద్అఫ్రూజ్, అజర్ లతో పలు గ్రామాలకు చెందిన ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్