మల్యాలలో 'బడి బాట'

68చూసినవారు
మల్యాలలో 'బడి బాట'
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం బడి ఈడు పిల్లలందరికీ మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈనెల 3 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చదువుకు దూరమైన పిల్లలను పాఠశాలలకు తీసుకురావడమే లక్ష్యంగా కార్యక్రమం మంగళవారం చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా మల్యాల మండల శివారు చోక్లా తండాలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. చంచు శ్రీశైలం, గుగులోతు రాంజీ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :