గార్ల మండల ముత్తితండా క్రాస్ రోడ్డు నుండి వయా ముత్తితండా మీదుగా పోచారం వరకు వెళ్ళు బీటి రోడ్డు నిర్మాణం నాణ్యత లోపంగా వేసిన కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్ లైసెన్సును రద్దు చేయాలని ముత్తితండా గ్రామస్తులు భారీగా ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు శ్రీను, రమేష్, మల్సూర్, శంకర్ మరియు ముత్తితండా గ్రామస్తులు భారీగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.