డివైఎఫ్ఐ అధ్వర్యంలో గార్ల మండలంలో సావిత్రి బాయి పూలే వర్ధంతి సందర్భంగా సోమవారం ఘనంగా పూలదండతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు మాలోత్ శాంతి కుమార్ మాట్లాడుతూ భారతీయ సంఘసంస్కర్త ఉపాధ్యాయుని రచయిత్రి ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య. కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి, ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తికి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.