మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జీవిత పోరాటాలు, త్యాగాలను నేటి సమాజానికి తెలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందుకూరి శ్రీనివాస్, ఐద్వా జిల్లా నాయకురాలు అలవాల సత్యవతి లు డిమాండ్ చేశారు. సావిత్రి బాయిపూలే వర్ధంతిని సిపిఎం, ఐద్వా అధ్వర్యంలో సోమవారం మండల కేంద్రం లో ఘనంగా నిర్వహించారు.