తెలంగాణ రాష్ట్ర మహిళల పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణులు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగపు జిల్లా నేత విజయ లక్ష్మి మాట్లాడుతూ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా బస్సులో మహిళా ప్రయాణికులు కుట్లు అల్లికలే కాదు అవసరమైతే రికార్డింగ్ డ్యాన్సులు చేసుకున్నా తనకు అభ్యతరం లేదని చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని ధ్వజమెత్తారు.