మంగపేట - తాడ్వాయి అడవుల్లోకి చేరిన పెద్దపులి

64చూసినవారు
ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మాపురం వైపు నుండి తాడ్వాయి మండలంలోకి పెద్దపులి ప్రవేశించిందని పోలీసులు, అటవీశాఖ అధికారులు బుధవారం దృవీకరించారు. ఓ రైతు పొలంలో పాదముద్రలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ పనులు, పశువుల మేత, ఇతర పనుల నిమిత్తం వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లకూడదని అటవీశాఖ అధికారి అశోక్ హెచ్చరించారు. పెద్దపులి సమాచారం తెలిస్తే అటవీశాఖ అధికారులకు తెలపాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్