రైతుల ఆలోచన అదుర్స్.. డ్రోన్‌తో మందుల పిచికారి

73చూసినవారు
వ్యవసాయంలో రైతులు నూతన పద్ధతులను అవలంబిస్తున్నారు. కూలీలు, పెట్టుబడి భారం పెరగడంతో కొత్త ఆలోచనలతో రైతాంగం ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ములుగు జిల్లా వాజేడు మండలంలోని రైతులు గత కొద్ది రోజులుగా డ్రోన్ ద్వారా తమ పంటలకు మందును పిచికారి చేస్తున్నారు. కూలీల వ్యయం తగ్గడంతో సమయం సైతం ఆదా అవుతుందని రైతులు అంటున్నారు. దాదాపు 5 ఎకరాల వరి పంటకు గంటా 15 నిమిషాల్లో డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్