ములుగు మండలం జంగాలపల్లి నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ఆశా వర్కర్లు 6 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ మంగళవారం నిరసన చేపట్టారు. అనంతరం ములుగు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో ఫిక్స్డ్ వేతనం రూ. 18 వేలతో పీఎఫ్, ఈఎస్ఐ బెనిఫిట్స్ తో కూడిన ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.