ములుగు జిల్లా ఏటూరునాగారం అడవుల్లో మావోయిస్టులను చిత్ర హింసలు పెట్టి చంపారని అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బొప్పాడి అంజమ్మ ఆరోపించారు. సోమవారం ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రి వద్ద ఆమే మీడియా తో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం భూటకపు ఎన్కౌంటర్ లను ప్రోత్సహిస్తుందని, ఆదివాసులను స్వేచ్చగా బ్రతకనివ్వాలని కోరారు. ఏజెన్సీ లో సైనిక్ క్యాంపు లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.