బయ్యక్కపేటలో వాలీబాల్ ఆడిన మంత్రి సీతక్క

70చూసినవారు
బయ్యక్కపేటలో వాలీబాల్ ఆడిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట బాలుర ఆశ్రమ పాఠశాలలో ఆదివారం విద్యార్థులతో కలిసి కాసేపు మంత్రి సీతక్క వాలీబాల్ ఆడి సందడి చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సమానంగా రాణించి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్