ములుగు: అడవిలో మంటల వలన కలిగే నష్టాలపై అవగాహన

81చూసినవారు
ములుగు: అడవిలో మంటల వలన కలిగే నష్టాలపై అవగాహన
ములుగు జిల్లా వాజేడు మండలం కొత్త టేకులగూడెం గ్రామంలోని ప్రజలకు కృష్ణాపురం సెక్షన్ అటవీశాఖ అధికారి నారాయణ ఆధ్వర్యంలో శనివారం అడవిలో అగ్ని ప్రమాదాలు, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అటవీలో మంటల వలన కలిగే నష్టం, వాతావరణంలో సంభవించే మార్పులు, కాలుష్యం, వాటి వలన కలిగే ప్రభావాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. అడవికి నిప్పు- పర్యావరణానికి ముప్పు అని అన్నారు. అడవికి మంటలు అంటుకోకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్