ములుగు: మావోయిస్టుల మృతదేహాలను బంధువులకు అప్పగింత

80చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతిచెందిన ఏడుగురికి పోస్టుమార్టం పూర్తయింది. ఈ మేరకు ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రానికి చెందిన ఆరు మృతదేహాలలో కామేష్, భద్రు, కరుణాకర్, జమున మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. కాగా తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన మల్లయ్య@మధు మృతదేహాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం వరకు తరలింపు వాయిదా వేశారు. మరో 2 మృతదేహాలు అప్పగించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్