ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్ర గ్రామానికి చెందిన బండ సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ కుటుంబాన్ని శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ పరామర్శించి 50 కేజీల బియ్యం, రూ. 5 వేల రూపాయల ఆర్థికసాయం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకన్న, కృష్ణ, సునీత, పంగ శీను, గొంది కిరణ్, గాజుల కిరణ్, వేల్పుల సాంబయ్య, నారాయణ, సుమలత తదితరులు పాల్గొన్నారు.