క్రీడల్లో గెలుపు ఓటమి సహజమని పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. ములుగు మండలం జాకారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీల్లో కలెక్టర్ దివాకరతో కలిసి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అక్కడ ఉన్న విద్యార్థినిలతో కబడ్డీ ఆడి అందరిని ఉత్సాహపరిచారు. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు.