ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కోయగూడ గ్రామపంచాయతీ పరిధి రాంనగర్ లో ఇంటింటి ఇందిరమ్మ ఇళ్ల సర్వేను బుధవారం ఎంపీడీఓ రాజ్య లక్ష్మి పరిశీలించి అధికారులకు పలు సూచనలను చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో కాసేపు ఎంపిడిఓ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈజిఎస్ ఏపిఓ చరణ్ రాజ్, పంచాయతీ కార్యదర్శి రెడ్డి లక్ష్మీ నారాయణ, కారోబార్ ఇర్సవడ్ల రాజు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.