ములుగు: మంత్రి సీతక్కపై అసభ్య పదజాలంతో పోస్ట్.. పోలీసులకు ఫిర్యాదు

53చూసినవారు
ములుగు: మంత్రి సీతక్కపై అసభ్య పదజాలంతో పోస్ట్.. పోలీసులకు ఫిర్యాదు
సామాజిక మాధ్యమాల్లో మంత్రి సీతక్కపై అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు చింతల్ గీతారెడ్డిపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ ములుగు జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాటి మహిళ అనే గౌరవం లేకుండా ఫేస్ బుక్ లో అసభ్య పదజాలంతో పోస్టు చేయడం దురదృష్టకరమన్నారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్