చతిస్గడ్ రాష్ట్రంలోని అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు@ దామోదర్ మృతి చెందాడని వస్తున్న వార్తలపై ఎలాంటి స్పష్టత రాలేదు. శనివారం మావోయిస్టు గంగా పేరుతో విడుదలైన లేఖ ఫేక్ అని ప్రచారం జరుగుతుంది. కాల్వపల్లిలోని కుటుంబసభ్యులకు సైతం దామోదర్ మృతిపై ఎలాంటి సమాచారం లేదని ఆదివారం తెలిపారు.