ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్ష రాసేందుకు వాజేడు మండలంలోని ధర్మవరంకు చెందిన పదవ తరగతి విద్యార్థులు శుక్రవారం ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఆటో డ్రైవర్ పరిమితికి మించి విద్యార్థులను తీసుకొని వస్తున్న క్రమంలో చీకుపల్లి ప్రధాన రహదారిపై హఠాత్తుగా సైడుకు కూర్చున్న ఇద్దరు విద్యార్థినిలు కిందపడిపోయారు. దీంతో పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.