కాళ్లపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో డ్రైవర్కు తీవ్ర గాయాలైన ఘటన ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో గురువారం జరిగింది. గొల్లగూడేనికి చెందిన దుర్గ ప్రసాద్ తన ట్రాక్టర్ నడుపుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ టైర్ తన రెండు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.