ములుగు జిల్లా తాడ్వాయి రేంజ్ పరిధిలో తీవ్రమైన ఈదురు గాలులు రావడంతో దాదాపు 500 ఎకరాల విస్తీర్ణతో 50 సంవత్సరాలు వయసు గల వృక్షాలు నేలమట్టం అయిన ప్రదేశాన్ని గురువారం తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ తో పాటు చాప బాబు దొర, షేక్ జావిద్ గురువారం సందర్శించారు. నష్టానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.