ములుగులోని శ్రీనివాస కాలనీలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు రోడ్డుపై నిలవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆదివారం స్థానికులు తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. కాలనీలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని వారు కోరారు.