ములుగు జిల్లాలో ఆదరణకు నోచుకోని సెగ్రిగేషన్, కంపోస్టు షెడ్లు

581చూసినవారు
ములుగు జిల్లాలో చాలా చోట్ల సెగ్రిగేషన్ షెడ్లు, కంపోస్టు ఎరువు కేంద్రాలు ఆదరణకు నోచుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా 174 గ్రామపంచాయతీల్లో రూ. 2. 50 లక్షలు మేర వెచ్చించి షెడ్లు నిర్మించారు. అయితే వాటిలో కంపోస్టు ఎరువు తయారీ చేపట్టకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ట్రాక్టర్ ద్వారా సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ షెడ్డుకు తరలించి తడి, పొడి చెత్తను వేరు చేయాల్సి ఉండగా పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదు.

సంబంధిత పోస్ట్