ములుగు జిల్లా వాజేడు ఎస్సై గా విధులు నిర్వహిస్తు ఆత్మహత్య చేసుకున్న హరీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు జిల్లా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆత్మహత్య చేసుకున్న స్థలానికి జిల్లా ఎస్పీ చేరుకుని పరిశీలించారు. వాజేడులోని రిసార్ట్ లో 107 రూం లో గత రాత్రి ఓ మహిళ తో వచ్చి రూం తీసుకున్నారు. సోమవారం ఉదయం తన డ్రైవర్ కు ఫోన్ చేసి పికప్ చేసుకోవాలని కోరాడని తెలిసింది.