నర్సంపేట: పులి జాడ కోసం అన్వేషిస్తున్న రెండు డిపార్ట్మెంట్ లు

61చూసినవారు
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల పరిధిలోని రుద్రగూడెం తండా శివారులో పులి పాదముద్రలను శనివారం నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ పాద ముద్రల ఆధారంగా పులి ఉన్న స్థావరాన్ని గుర్తిస్తామని చెప్పారు. పులుల భయం నుంచి ప్రజలను రక్షించే విధంగా చర్యలు చేపడతామన్నారు. పులి కోసం ఫారెస్టు, పోలీసు అధికారులు వెతుకుతున్నారని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్