వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గుట్కా, అంబర్ ప్యాకెట్లు విక్రయిస్తున్న వెంకటేశ్వర కిరణం అండ్ జనరల్ స్టోర్స్‌పై శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 16 వేల విలువ చేసే గుట్కా, అంబర్ ప్యాకెట్లు సీజ్ చేసి వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.