
వరంగల్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి: ఈటల
వరంగల్-నల్గొండ-ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని మల్కాజిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ ప్రైవేటు పాఠశాలలో మంగళవారం అధ్యాపకులను కలిశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మరింత గట్టిగా కొట్లాడుతామని, కొట్లాడే పార్టీకి ప్రజలు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా బిజేపి నేతలు ఉన్నారు.