జనగాం జిల్లా రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు, రికార్డ్ గదులను పరిశీలించి స్టేషన్ పరిధిలోని గ్రామాల సమాచారం, స్టేషన్ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలను సీపీ అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ మొక్కల పెంపకం పై సీపీ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ భీం శర్మ, సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ స్టాఫ్ ఉన్నారు.