జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్న మడూరు గ్రామానికి చెందిన గూడ ఉప్పలయ్య S/0 వెంకటయ్య రోజువారి వృత్తిలో భాగంగా తేదీ 16 /03/ 2025 ఆదివారం సాయంత్రం 5 గంటలకు తాడిచెట్టు ఎక్కి కల్లు గీస్తున్న క్రమంలో కాలుజారి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. దీంతో చిన్నమడూర్ లో విషాదఛాయలు నెలకొన్నాయి.