కొడకండ్ల మండలంలో సోమవారం జరగనున్న పలు కార్యక్రమాలు వాయిదా పడినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారావత్ సురేశ్ నాయక్ తెలిపారు. కొడకండ్ల మండల కేంద్రంలో, ఇందిరమ్మ మోడల్ హౌస్ భూమిపూజ, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరుకావాల్సి ఉండగా.. అనివార్య కారణాలవల్ల వారి పర్యటన వాయిదా పడినట్లు సురేశ్ నాయక్ తెలిపారు.