ఆత్మకూరు మండల తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి ఉత్తమ తహసిల్దారుగా గురువారం అవార్డు అందుకున్నారు. ఈ మేరకు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హనుమకొండ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో రెవెన్యూ విభాగం నుండి ఉత్తమ తహసిల్దార్ గా దేవాదాయ పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. వరంగల్ ఎంపి కడియం కావ్య, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాలు పాల్గొన్నారు.