నడికూడ మరియు పరకాల మండల పరిధిలో శివాజీ యువసేన ఆధ్వర్యంలో శనివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శివాజీ యువసేన అధ్యక్షుడు కుసుంబ మధుకర్ మాట్లాడుతూ. శివాజీ దేశంలో గొప్ప రాజుగా పరిపాలన దక్షత ను చూపించారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మోకిడి దీపక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.