ప్రతీ రైతు కుటుంబం ఆనందంగా ఉండాలి: పరకాల ఎమ్మెల్యే
ప్రతీ రైతు కుటుంబం ఆనందంగా ఉండాలని, రైతు శ్రేయస్సే ప్రధాన ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు. శనివారం పరకాల పరిధిలోని సంగెం, ఊకల్, కాపుల కనపర్తి రైతు సహకార సంఘాల సభ్యులతో కలిసి సందర్శించారు. అనంతరం ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్ సమావేశం మందిరంలో ముల్కనూరు సొసైటీ చైర్మన్, ప్రవీణ్ రెడ్డి బ్యాంకు అభివృద్ది చెందిన తీరును ప్రొజెక్టర్ ద్వారా వివరించారు.